విషయ సూచిక

వేద ఋషి లింగాలు

సనాతన ఋషులు వేదమును అందించి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు. ఋషులు వారి తపోశక్తితో ధ్యానములో దర్శించిన, వినిన మంత్రాలను శ్లోక రూపంలో వేదములో పొందుపరిచారు. వారిని మంత్రద్రష్టలు అని అంటారు.

వేద ఋషుల యొక్క ఉనికి ప్రమాణము వేదం. తపోనిష్ఠులైన ఎందరో వేద ఋషులు అందించిన తత్వ జ్ఞానభాండాగారమే వేదము.

ఋషులు సమాధిలో అంతర్ముఖులై అంతర్వాణిని విని, లోక కళ్యాణం కోసం వాటిని అందించారు. ఋషులు భగవంతుని యొక్క తత్వజ్ఞానాన్ని లోకానికి ప్రసాదించారు. ఈ కాలంలో ఇటువంటి వారిని మహర్షులని, జ్ఞానోదయం పొందిన గురువులని, సిద్ధగురువులని, యతులని సంభోదిస్తారు వేద ఋషుల యొక్క సంపూర్ణ జ్ఞానం ఇటువంటి సిద్ధగురువుల ద్వారా లోకానికి బహిర్గతమవుతుంది

వేద లింగ ప్రతిష్ఠాయజ్ఞం

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఋషి వేదాలను, వేద ఋషుల యొక్క హృదయాన్ని లోకానికి అందించాలనే సత్సంకల్పంతో వేదాలపై విస్తృత పరిశోధనలు చేశారు. వేదమాత సేవలో భాగంగా ఎన్నో అవైదిక ప్రచారాలను ఖండించి అసలైన సత్య జ్ఞానాన్ని లోకానికి అందించే దిశగా ప్రచారం చేస్తున్నారు.

ఆ పరమేశ్వరుడి సంకల్పంతో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు 728 వేద ఋషులు ,84 మన్వంతర సప్త ఋషులు, 1204 ఉపనిషత్ మరియు పురాణ ఋషులు మొత్తం 2016 ఋషులు వేదమును లోకానికి అందించే అసాధారణ సేవ చేసినట్లు గుర్తించారు. వారి అసాధారణ సేవలకు గుర్తుగా ఒక్కొక్క ఋషి నామము పై ఒక్కొక్క శివలింగమును మొత్తం 2016 వేద ఋషి శివలింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఈ ప్రతిష్ఠల వలన ఆ ఋషుల యొక్క ఆశీస్సులు లోకానికి అందించబడతాయి.

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిచే శ్రావణమాసంలో ఋషి లింగాల ప్రతిష్ఠ. August 7-11, 2022.

వివరాలు