విషయ సూచిక

శివ శక్తి సాయి ఆలయం

ప్రపంచం మొత్తంలో దేవుడిని పూజించేవారు, నమ్మేవారు చాలా మంది ఉంటారు. దైవానికి సంబంధించిన అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల కుటుంబమంతటికి మంచి జరుగుతుందని భావిస్తారు. ఆలయ నిర్మాణానికి విరాళం ఇవ్వడం వల్ల పాపనాశనమే కాకుండా పుణ్యం కూడా లభిస్తుందని ప్రతి ఒక్కరు విశ్వసిస్తారు.

సువర్ణ శివ శక్తి శిరిడి సాయి ఆలయం రమణేశ్వర మహా క్షేత్రం యొక్క హృదయము వంటిది. ఒక ఆధ్యాత్మిక సాధకులకు శివ(నిరాకార చైతన్యము), శక్తి( కుండలినీ శక్తి), సాయి(శిరిడి సాయి) దైవాల యొక్క ఆరాధన విశిష్టతను చాటి చెప్పడమే ఈ ఆలయ ప్రధాన ఉద్దేశ్యం. ఆంతర్యములో సూక్ష్మ రూపంలో కొలువైన దైవాలకు బాహ్య రూపక వ్యక్తీకరణం ఈ సువర్ణ శివ శక్తి సాయి ఆలయం.

శివ శక్తి సాయి ఆలయ విశేషాలు

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు మహా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమంటే 243 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు కలిగి; 10,000 మంది ఒకేసారి ధ్యానం చేయడానికి వీలుగా ఉంటుంది . ఈ ఆలయ గర్భ గుడిలో 6 అడుగుల బంగారు శివ , పరాశక్తి, కనక దుర్గా, రుద్ర భగవాన్ , శిరిడి సాయి విగ్రహాలను ప్రతిష్ఠించబోవుచున్నారు.

6ft gold shiva idol to be consecrated at Ramaneswaram

ఈ అత్యద్భుత మహా ఆలయ నిర్మాణ దాతగా అవకాశం రావడం అంత సులభం కాదు. 6 అడుగుల స్వర్ణ శివ , పరాశక్తి, కనక దుర్గ, రుద్ర భగవాన్ , శిరిడి సాయి విగ్రహాలకు బంగారాన్ని సమర్పించే అవకాశం బహు అరుదుగా లభిస్తుంది. అందుకే ఇలాంటి అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని శివ శక్తి శిరిడి సాయినాథుల అనుగ్రహాన్ని పొందండి.

6ft gold shakti idol to be consecrated at Ramaneswaram

ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు, సర్వ శ్రేష్ఠ, మహా శ్రేష్ఠ, విశేష విశిష్ట, విశేష , విశిష్ట స్వర్ణ దాతల పేర్లు బోర్డు పై వ్రాయ బడును .మీ వంతు సేవగా 5 స్వర్ణ విగ్రహాలకు బంగారం రూపంలో గాని, cash రూపంలో గాని విరాళం సమర్పించవచ్చును.

6ft gold shirdi sai idol to be consecrated at Ramaneswaram

మహా ఆలయ నిర్మాణ సేవలో 2 రకాలుగా భక్తులు సేవ చేసుకోవచ్చును

1. శివ శక్తి సాయి ఆలయ నిర్మాణ దాత

2. స్వర్ణ పంచ 6 అడుగుల విగ్రహాల దాతలు