వేదాలు - వాస్తవాలు మరియు పరిశోధన

వేదాలు పురాతనమైనవి మరియు మానవాళికి అందుబాటులో ఉన్న ప్రాచీన గ్రంథాలు. వేదాలు మానవులు రచించినవి కాదు. వేదాలు ఈశ్వరోక్తం. విశ్వము, దేవుడు, మనస్సు మరియు కుండలినీ శక్తి గురించిన రహస్య జ్ఞానం వేదాలలో నిక్షిప్తమై ఉంది. పురాతన కాలములో వేదములు అన్ని వర్గముల వారికి అందుబాటులో ఉండేవి, వేద అధ్యయనం ప్రతీ ఒక్కరి రోజువారీ జీవితములో ఒక భాగముగా ఉండేది.

గత 5000 సంవత్సరాల నుండి వేదములు కొన్ని వర్గాలవారికి మాత్రమే పరిమితమయినవి. దీని ఫలితముగా మహిళలు మరియు సమాజములోని ఇతర వర్గాల ప్రజలకు వేదం అందుబాటులో లేకుండా పోయింది. వేద అధ్యయనము చేయాలి అనుకున్నవారికి తీవ్రమైన ఆంక్షలు మరియు శిక్షలు విధించారు. ఇది మానవజాతి వేద మార్గము నుండి తప్పుకోవడానికి దారి తీసింది.

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు వేదములు కొన్ని వర్గాలవారికి మాత్రమే పరిమితమవ్వడాన్ని తీవ్రముగా ఖండించారు. వేదము ఈశ్వరోక్తము ఫలానా వారు మాత్రమే అధ్యయనం చేయాలి అని వేదములో చెప్పబడలేదు అనే నిగూఢ సత్యాన్ని బహిర్గతం చేశారు. వేదమును స్త్రీలకు మరియు అన్ని వర్గములవారికి బోధించడానికి మహర్షి వారు సాహసోపేతంగా శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా స్త్రీలు, శూద్రుల చేత వేద పఠనం చేయించారు.

వేదాలు స్త్రీలు, మరియు సమాజములో అన్ని వర్గాల వారు చదువవచ్చు అని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు పునరుద్ఘాటించారు. కుల, వర్గ, లింగ భేదాలు లేకుండా ఎవరైనా వేదమును పఠించవచ్చును మరియు వేద మంత్రాలతో హోమం కూడా చేయవచ్చును అనే వాస్తవాన్ని లోకానికి తెలియచెప్పారు.

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఫిబ్రవరి 2018 లో 20,350 వేదమంత్రాలతో 20,350 హోమకుండాలలో హోమమును నిర్వహింపచేసి భారీ ఎత్తున వేద ప్రచారాన్ని ఆచరింప చేశారు. 40,000 మంది స్త్రీలు, శూద్రులు మరియు అన్ని వర్గముల ప్రజలు ఈ హోమ కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ కార్యక్రమము ప్రతి ఇంటికి వేదాన్ని తీసుకువెళ్లాలి అనే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆశయానికి సాక్ష్యముగా నిలిచింది.

సామాన్య మానవులు కూడా వేదాన్ని సులభముగా పఠించాలి అనే ఉద్దేశ్యముతో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఉదాత్త, అనుదాత్త, స్వరిత సంగీత స్వరాలతో వేద మంత్రాలను పఠించే సనాతన వేద ఉఛ్చారణ పద్ధతిని లోకానికి భోదించారు. సిద్ధగురు బోధించిన, పఠించిన కొన్ని వేద మంత్రాలు క్రింద పేర్కొనబడ్డాయి:

  • శ్రీ సూక్తం
  • ఈశావాస్యోపనిషత్
  • గణేశ సూక్తం
  • గాయత్రీ మంత్రం
  • సంవత్సరేష్టి మంత్రాలు
  • నక్షత్ర సూక్తం
  • ఆదిపరాశక్తి సూక్తం