రమణేశ్వరములో ప్రతిష్ఠించబడిన శివ సహస్ర నామాలలో ఒక్క నామముపై ఒక్కొక్క శివలింగము మొత్తము 1008 శివలింగాల దర్శనము, స్పర్శనము అపార పుణ్యదాయకము. కష్ట నష్ట దుఃఖ నివారకం మరియు మోక్షదాయకం.

సహస్ర శివలింగ ప్రతిష్ఠ

అవలోకనం

శివుడు విశ్వాన్ని సృజించిన అది దైవము. విశ్వకర్త. శివలింగము నిరాకార శివునికి ప్రతీక. శివలింగ ప్రతిష్ఠలకు సనాతన కాలము నుండి ఒక ప్రాముఖ్యత ఉంది. నేను లోక కళ్యాణార్ధము శివలింగ రూపములో కొలువై ఉంటానని సాక్షాత్తు పరమశివుడే బ్రహ్మ విష్ణువులకు బోధించాడు. దీనికి సాక్ష్యమే ఎందరో దేవతలు ప్రతిష్ఠించిన శివలింగాలు. ఎందరో దేవతలు, ఋషులు శివలింగాలు ప్రతిష్ఠించి శివుని యొక్క వైభవాన్ని, శివలింగ ప్రతిష్ఠ ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక సాధకులకు తెలియచేశారు.

పరమశివుడిని ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలలో కీర్తిస్తూ ఆరాధించడం జరుగుతుంది. ఇందులో స్థవరాజమని ముల్లోకాలలో ప్రఖ్యాతి గాంచిన స్తోత్రం “శివసహస్రనామస్తోత్రం”. దేవదేవుడు, పరాత్పర దైవమైన పరమశివుని పై సాక్షాత్తు బ్రహ్మదేవుడు విరచించిన ఆది స్తోత్రం. బ్రహ్మదేవుడు శివసహస్రనామ స్తోత్రంను తండి మహర్షికి బోధించాడు. తండి మహర్షి ఉపమన్యు మహర్షికి బోధించాడు. ఉపమన్యు మహర్షి శ్రీ కృషుడికి బోధించిన సనాతన స్తోత్రం, శివసహస్రనామస్తోత్రం. శ్రీకృష్ణపరమాత్మ లోకానికి ఈ స్తోత్రమును అందించారు.

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు శివ సహస్ర నామ వైభవాన్ని, విశిష్టతను గుర్తించి రమణేశ్వరములో ఒక్కొక్క శివ నామము పై ఒక్కొక్క శివ లింగమును ప్రతిష్టించాలని సంకల్పించారు. సిద్ధగురు శివలింగ ప్రతిష్ఠల ఆంతర్యము ఏమంటే “బాహ్యములో శివుడిని ఆరాధిస్తే ఆంతర్యములోని శివుడిని దర్శించగలము”. బయట శివలింగ రూపములో ఉన్న శివుడిని ఆరాధిస్తే లోపల నిరాకార రూపములో ఉన్న శివుడిని అనుభూతితో గ్రహించగలము.

మహాపీఠమును దర్శించే భక్తులు గమనించవలసినవి.

మహాపీఠమును సందర్శించే భక్తులు ఉదయము 8:00 గంటల నుండి 9:00 గంటలవరకు జరిగే నిత్య శివ లింగ ఆరాధన సేవలో ఉచితముగా పాల్గొనే అవకాశము కల్పించబడింది.

శివ నివేదన - పరమ శివునికి సమర్పించే సేవలు

సహస్ర శివ లింగ అభిషేకం

భక్తులు శివలింగమును విశేష ద్రవ్యాలతో అభిషేకించి పరమశివుని శక్తిని పొందవచ్చు.

సహస్ర శివ లింగ అర్చన

భక్తులు సర్వ సంపదలు ప్రసాదించే దేవదేవుడిని అర్చించి సేవించవచ్చు.

సహస్ర శివ లింగ ప్రదక్షిణ

బా హ్యములో పరమశివుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆంతర్యములో ఆయన స్వభావాన్ని దర్శించడానికి ఒక సాధన.

శివలింగ ధ్యానం

ఇక్కడ ప్రతిష్ఠించబడిన సహస్ర శివ లింగాలు లోకానికి మోక్ష మార్గానికి దారి చూపుతాయి. ఈ శివ లింగాల దర్శనము ఆంతర్యములోని శివుడిని దర్శించే ఆలోచనకు దారితీసేలా చేస్తుంది. అప్పుడు క్రమముగా విశ్వములోని ప్రతీ అణువులో ఆ శివుడిని దర్శించే అవకాశము కలుగుతుంది మరియు ప్రతీ జీవిలో నిరాకారముగా కొలువై ఉన్న ఆ పరమ శివుడిని అనుభూతితో గ్రహించే భాగ్యము కలుగుతుంది.