సిద్ధగురువుతో సంభాషణ

“శిష్యుడి హృదయం, గురువు యొక్క హృదయముతో కలిసినపుడు ఆధ్యాత్మికత వికసిస్తుంది”

- సిద్ధగురు

ఆధ్యాత్మిక ప్రశ్నలు - సమాధానాలు

1995  సంవత్సరం, జూన్ 29న నా గురుదేవుడైన శిరిడిసాయి మరియు లివింగ్ గురువు మాతా పూర్ణానందగిరి యోగిని అనుగ్రహము వలన నేను ఆత్మసాక్షాత్కారము పొందాను

అవును. అది సృష్టి అనివార్య సిద్ధాంతం. గురువు లేకుండా ఎవరూ ఆత్మను దర్శించలేరు. ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే మరొకరికి ఆత్మదర్శనం కలిగించగలడు.

నేను పొందిన అనుభవమే ప్రమాణము. నేను ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత పరమాత్మ ఎలా ఉంటాడు? అతని లక్షణాలు ఏమిటి అని అనేక మహాత్ముల, మహర్షుల, శాస్త్ర తత్వ గ్రంథాలలో చెప్పబడిన విషయాలు పరిశీలిస్తే నా అనుభవాలతో అవి సరి సమానంగా  ఉన్నాయి.

మల్లెపువ్వు యొక్క సుగంధాన్ని ఆ సన్నిధిలో ఏవిధంగా అనుభవిస్తామో ఆ విధముగా ఒక సిద్ధగురువు సన్నిధిలో అప్రయత్నముగా మనస్సు ప్రశాంతతతను, నిశ్చలత్వమును పొందుతుంది. అదియే ప్రమాణము

ఆత్మసాక్షాత్కారం పొందడానికి నేను ఏ సాధన చేయలేదు. రమణ మహర్షి లాగ ఏ సాధన లేకుండా, కేవలం నా గురువైన శిరిడిసాయి అపార కృపతో నేను పొందాను. నేను చేసిందల్లా శిరిడిబాబాను అమితముగా ప్రేమించడమే.

నా ఉద్దేశ్యంలో ఎవరైనా నేను ఆత్మసాక్షాత్కారము పొందాను అని చెప్పలేదు అంటే అతనికి ఆ అనుభూతి లేదు అని అర్థం. ప్రతి మనిషి యొక్క సత్య స్వరూపం ఆత్మ లేదా భగవంతుడే. ఆత్మ స్వరూపాన్ని అనుభూతిగా పొందినవారే ధైర్యముగా లోకానికి ప్రకటిస్తారు. పొందనివారు ప్రకటించలేరు. ఎందరో మహాత్ములు తమ ఆత్మసాక్షాత్కార అనుభూతిని లోకానికి అందించారు.

ఆత్మసాక్షాత్కారము పొందడం అనేది అన్నింటికీ అతీతమైన ఒక దివ్య అనుభూతి. ఆ అనుభూతిని పొందిన గురువు యొక్క మాటలు అతని శిష్యుల జీవితాలలో ఆ గురువు చేసిన మహిమలే ప్రమాణము.

నీవే భగవంతుడవు. దానిని అనుభూతితో తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆత్మసాక్షాత్కారము పొందడమే ప్రతి మనిషి యొక్క పరమ ధర్మము. అదే ఎవరికి వారు చేసే నిజమైన సేవ.