రాధాకృష్ణమాయి

శిరిడిసాయినాథుని శుద్ధ భక్తితో, దివ్య ప్రేమతో సేవించి తన జీవితాన్నే ఆత్మార్పణ చేసిన శిరిడి సాయి శిష్యులలో అగ్రగణ్యురాలు శ్రీ రాధాకృష్ణమాయి. శ్రీ రాధాకృష్ణమాయి శిరిడి సాయిబాబా కోసం తన జీవితాన్నే నివేదన చేసి బాబా అనుగ్రహంతో దుర్లభమైన ఆత్మసాక్షాత్కారమును పొందిన సిద్ధురాలు. పరమగురువైన, మహాయోగీశ్వరుడైన శిరిడిసాయినాథుని ఏవిధముగా ప్రేమించాలో, సేవించాలో, ఆరాధించాలో ఆత్మార్పణము చేయాలో, గురు ప్రేమను ఏవిధంగా పండించుకోవాలో రాధాకృష్ణమాయి జీవితము ద్వారా అవగతమవుతుంది.

రాధాకృష్ణమాయి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు అవమానాలు పొందినప్పటికీ గురువు మీద, దైవం మీద ఏనాడు విశ్వాసాన్ని కోల్పోలేదు. రాధాకృష్ణమాయి 1916 వ సంవత్సరంలో మరణించింది. రాధాకృష్ణమాయి మరణానికి సంబంధించి ఎన్నో అపోహలు, అసత్య, కల్పిత దుష్ప్రచారాలు శిరిడిలో ఈనాటికి ఉన్నాయి.

శిరిడిసాయిని ప్రేమతో సేవించి, తన జీవితాన్ని ఆత్మార్పణ చేసిన రాధాకృష్ణమాయి వంటి అంకిత శిష్యురాలి మరణం గురించి ఉన్న అపవాదులను, చెడు ప్రచారాలను నిర్మూలించాలనే సంకల్పముతో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు తీవ్రంగా దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా శిరిడిలో మరియు కోపర్గావ్ లోని ప్రభుత్వ అధికారులను మరియు రాధాకృష్ణమాయి తో సహజీవనం చేసిన వ్యక్తుల బంధువర్గాన్ని విచారించారు. రమణానంద మహర్షి వారు చేసిన పరిశోధన వలన 98 సంవత్సరాలుగా లోకానికి గుప్తంగా ఉన్న రాధాకృష్ణ మాయి మరణ రహస్యాన్ని, Government official reports ద్వారా ఛేదించి, అసత్య కల్పిత, ఆరోపణలను, దుష్ప్రచారాన్ని ఖండించి రాధాకృష్ణమాయి యొక్క నిస్వార్థమైన, పవిత్రమైన సేవను, సాయిభక్తిని లోకమంతా తెలుసుకునేలాగా చేశారు.

ప్రేమమయి-సిద్ధయోగినీ  శ్రీ రాధాకృష్ణమాయి నిగూఢ దివ్య చరితామృతం

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు శ్రీ రాధాకృష్ణమాయి  జీవితాన్ని పరిశోధన చేసిన తర్వాత మాయి జీవితాన్ని మరియు పరిశోధనల విశేషాలను ఒక గ్రంథంలో పొందుపరిచారు. ఆ గ్రంథమే ప్రేమమయి - సిద్ధయోగినీ శ్రీ రాధాకృష్ణమాయి నిగూఢ దివ్య చరితామృతం. ఈ గ్రంథము తెలుగు భాషలో అందుబాటులో ఉన్నది.

siddhaguru book on radhakrishnamayi