“బంగారు శివలింగము గర్భగుడిలో ప్రవేశించిన భక్తుడు ఆ పరమశివుని అపార అనుగ్రహాన్ని పొందుతాడు”
స్వర్ణ శివ లింగము
అవలోకనం
ప్రపంచంలోనే మొట్ట మొదటి 3 అడుగుల బంగారు శివలింగమును రమణేశ్వర మహాక్షేత్రంలో భక్తులు దర్శించవచ్చును. భక్తుల యొక్క ప్రాపంచిక,ఆధ్యాత్మిక కోరికలు నెరవేరాలనే సత్ సంకల్పంతో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు 2017 విజయదశమి నాడు ఈ సువర్ణ శివలింగమును ప్రతిష్ఠించడం జరిగింది.
సువర్ణం అంటే బంగారు. సచ్చిదానంద చైతన్యము లో కొలువైన జీవుడి ఆరా కు ప్రతీక బంగారు వర్ణం. ఈ సువర్ణ శివలింగం యొక్క గర్భగుడిలో ప్రవేశించిన భక్తులు ఆ పరమానందం యొక్క ప్రకాశాన్ని అనుభవిస్తారు. రమణేశ్వరములో బంగారు శివలింగానికి నిత్యము వచ్చే సందర్శకులు అభిషేకం చేసి తరిస్తున్నారు. ఈ బంగారు శివలింగానికి అభిషేకం చేస్తే ఆరోగ్యవంతులై అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.
స్వర్ణ (బంగారు) శివ లింగ ఆవిర్భావం
ఆ పరమేశ్వరుడు సువర్ణ శివలింగ రూపములో రమణేశ్వరములో కొలువై ఉండటం అనేది ఈశ్వర సంకల్పం. పరమేశ్వర సంకల్పానికి అనుగుణముగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఒక ప్రణాళిక బద్దంగా, కళాత్మకంగా, సువర్ణ శివలింగాన్ని రూపకల్పన చేశారు. ధన రూపంలో మరియు బంగారు రూపంలో భక్తులు అందించిన సహకారంతో అందమైన సువర్ణ శివలింగం ఏర్పడింది. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు భక్తుల కోరికలు నెరవేర్చే విధముగా తన తపోశక్తిని ఈ సువర్ణ శివలింగములో నిక్షిప్తం చేశారు.
స్వర్ణ (బంగారు) శివలింగమునకు భక్తుల సమర్పణలు

అభిషేకము
శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకంతో సంతోషించినంతగా మరి యే ఇతర సేవలతో సంతోషించడు. కాబట్టి సువర్ణ శివలింగమునకు భక్తులు స్వయంగా అభిషేకం చేసే అవకాశం కల్పించడం జరిగింది. ఈ అభిషేక సేవలో పాల్గొనే భక్తులు అభిషేకం చేయడానికి 1 లీటర్ పాలు మరియు 3 లీటర్ల నీళ్లు ఇస్తారు.

ప్రదక్షిణ
అభిషేక అనంతరం సువర్ణ శివలింగం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయవచ్చు. సువర్ణ శివలింగ ప్రదక్షిణ శక్తి దాయకం.