12-jyotirlingas-slide1

విషయ సూచిక

ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనము ఆంతర్యములో ఉన్న దివ్యజ్యోతిని మేల్కొల్పుతుంది -సిద్ధగురు

ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయము - రమణేశ్వరము

జ్యోతిర్లింగము పరబ్రహ్మాత్మక లింగము, యావత్ విశ్వమును, విశ్వమును దాటి పరివ్యాప్తమై ఉన్నది. ఆ విధముగా పరివ్యాప్తమైన పరబ్రహ్మ యొక్క జ్యోతి స్వరూపము జ్యోతిర్లింగము. బ్రహ్మ, విష్ణువులు దేవాది దేవుడు నేనంటే నేనని తగవులాడిన సమయములో దేవాది దేవుడైన పరమ శివుడు తన అనంత స్వభావాన్ని సూచించే అనంత స్తంభము జ్యోతిర్లింగము.

మన శివ ఆరాధనలోపవిత్రమైన, ప్రసిద్ధమైన 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాలు నిరంతరము దివ్యశక్తిని ప్రసరింప చేస్తూ విశ్వమును, విశ్వములోని జీవులను దుష్ట శక్తుల నుండి కాపాడుతూ ఉన్నాయి.

12 జ్యోతిర్లింగాలు:

ప్రతీ నిత్యము అనేక పనులతో, ప్రాపంచిక లక్ష్యాలతో తీరిక లేని మానవులకు జ్యోతిర్లింగాల దర్శనము చాలా కష్టమైన పని. ఆ పరమశివుని దివ్య సంకల్పంతో, లోక కళ్యాణార్ధము సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట ప్రతిష్ఠించారు. ఎవరైతే రమణేశ్వరములోని 12 జ్యోతిర్లింగాలను దర్శిస్తారో వారికి వివిధ ప్రదేశాలలో కొలువై ఉన్న జ్యోతిర్లింగ దర్శన ఫలము కలుగుతుంది. ఇదే సిద్ధగురు దివ్యశక్తితో చేసిన ప్రతిష్ఠల మహత్యం.

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు 2019 ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి ఉత్సవాలలో జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించి లోకానికి అందించారు.

అభిషేకం

జ్యోతిర్లింగ అభిషేకం వలన ఉద్యోగం లేనివారికి ఉద్యోగం, ఉద్యోగంలో ఉన్నత పదవులు, బిజినెస్ పరముగా లాభము మరియు ఎన్నో ప్రాపంచిక ఫలాలను పొందెదరు. దీర్ఘ కాలిక వ్యాధులు తగ్గిపోతాయి .ఈ అభిషేకములో పాల్గొనే భక్తులకు 2 లీటర్ల పాలు మరియు పూజ ద్రవ్యములు ఇచ్చెదరు.