రమణేశ్వరం
మహాపీఠం
రమణేశ్వరంలోకి అడుగుపెట్టిన భక్తులు సాక్షాత్తూ భూకైలాసము లో అడుపెట్టిన అనుభూతిని పొందుతారు. రమణేశ్వరమును దర్శించిన భక్తులు ఇక్కడ అడుగడుగునా వ్యాపించిన సనాతన అధ్యాత్మిక తత్వమును అవగాహన చేసుకొని ఒక అలౌకిక ఆనందమును అనుభవిస్తారు.
రమణేశ్వరములో ఈ దేవాలయం శివ, శక్తి, శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం పేరుతో 2012 వ సంవత్సరములో స్థాపించబడింది. ఆ పరమేశ్వరుడు నిరాకారముగా ప్రతి జీవి హృదయములో కొలువై ఉన్నాడు. ఈ విషయాన్ని అవగాహన కల్పించడానికి ప్రతీకగా శివ, శక్తి, శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం లో నిరాకారుడైన ఆ శివుడిని శివ లింగాల రూపములో ప్రతిష్ఠించడం జరిగింది. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యములో, వారి మార్గదర్శకత్వములో రమణేశ్వరములో నెలకొల్పబడిన విభిన్న సాధనల ద్వారా, సాధకుడు తన యొక్క అంతిమ లక్ష్యమైన పరమాత్మ సాక్షాత్కారమును పొందే అవకాశము ఉన్నది.
Ramaneswaram in Wikitravelనీవే దేవుడవు - అవగాహన
రమణేశ్వరము దేవాలయము యొక్క ప్రధాన లక్ష్యం “జీవుడే దేవుడు” (నీవే దేవుడవు) అనే అవగాహన కల్పించడం. నిరాకారుడైన ఆ పరమ శివుని లింగ రూపములో సేవించడం, శివుని ధ్యానించడం, సిద్ధగురు శక్తిపాతముతో (గురువు యొక్క కాస్మిక్ ఎనర్జీ శిష్యుడికి ప్రసరింప చేయడం) శిష్యుడిలోని కుండలిని శక్తిని మేల్కొలిపి నేనే దేవుడను అని అనుభూతితో తెలుసుకొనేలాగా చేయడము, రమణేశ్వరము యొక్క ప్రధాన లక్ష్యము.
శివ, శక్తి, సాయి అనుగ్రహ మహా పీఠం నిర్వహించే సేవలు
నిరాకారుడైన శివుని సేవించి, ధ్యానించి, పరమానందములో రమించాలనుకొనే ఆధ్యాత్మిక సాధకులకు రమణేశ్వరము ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆశ్రమము. రమణేశ్వరములో ప్రతిష్ఠించబడిన 1550పైగా శివలింగాలకు మరియు 90 పైగా విగ్రహ మూర్తులకు ప్రతినిత్యము అభిషేకాలతో, పూజలతో 150 మంది సేవకులు సేవలందిస్తూ వారి జీవితాలను పవిత్రం చేసుకుంటున్నారు. ఈ ఆశ్రమమునకు విచ్చేసిన భక్తులకు కూడా నిత్యఅభిషేక సేవలో పాల్గొనే అవకాశం కల్పించబడింది.
శివ శక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం చేపట్టిన కార్యక్రమము
శివ శక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం చేపట్టిన మొదటి ఉతృష్టమైన సేవకార్యక్రమము, సహస్ర శివలింగ ప్రతిష్ఠ - శివ సహస్ర నామాలలోని 1008 నామాలలో ఒక్కొక శివ నామము పై ఒక్కొక్క శివ లింగము స్థాపించడం. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ప్రతీ జీవి హృదయములో నిరాకారముగా కొలువైన పరమశివుడు అన్న అవగాహనను సాధకులలో పెంపొందించడమే లక్ష్యముగా సహస్ర శివలింగ ప్రతిష్టకు 2015 సంవత్సరములో శ్రీకారం జరిగింది. ఆనాటినుండి, కుల, మత, ఆర్ధిక భేదాలు లేకుండా ఈ కార్యక్రమము కొనసాగుతుంది. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి అనుగ్రహముతో ఎంతోమంది శివలింగ దాతలు ఈ సహస్రశివ లింగ ప్రతిష్ఠలో పాల్గొని 2019 వ సంవత్సరములో సహస్ర శివలింగప్రతిష్ఠ దిగ్విజయముగా పూర్తి చేయడం జరిగింది.
సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు నిర్వహించిన ప్రతిష్ఠలు
23 feet monolith Bana Linga
Bana lingam is the Shivalingam of the highest order out of various types of Shivalingas being worshipped in this World. Knowing the power of Bana Shivalingam through his transcendental vision, Siddhaguru Sri Ramanananda Maharshi consecrated numerous banalingas at Shiva Shakthi Shirdi Sai Anugraha Mahapeetam. 23 feet Bana Shivalingam consecrated as ‘Ramana Sai lingeswara’ . This is the tallest monolithic Bana Shivalinga .
Nakshatra Vanam
Nakshatra Vanam at Ramaneswaram has all trees associated with 27 birth stars. By visiting Nakashatra Vanam, one can feel the divinity of these trees
Shirdi Sai Anugraha Peetam, Vizag
Shirdi Sai Anugraha Peetam, Vizag was started by Siddhaguru. Shirdi Sai, Lord Shiva, Shakti, Ganesha idols were consecrated in this peetam. Call 1800 1022 393 for more information.