రాధాకృష్ణ మాయి

రాధాకృష్ణమాయి ఆధ్యాత్మిక సాధకులకు ఆదర్శమూర్తి. శిరిడి సాయి సంస్థాన్ స్థాపనకు మూలకర్త . శిరిడీలో నాలుగు ఆరతులు జరిగేలా రూపకల్పన చేసిన మహాభక్తురాలు . శిరిడిసాయినాధుని శుద్ధభక్తితో ,దివ్య ప్రేమతో సేవించి తన జీవితాన్నే ఆత్మార్పణ చేసిన శిరిడి సాయి శిష్యులలో అగ్రగణ్యురాలు శ్రీ రాధాకృష్ణమాయి. శిరిడిబాబా శిష్యులలో సాటిలేని శిష్యురాలు . ఆమె సృజనాత్మకతకు మారుపేరు . సాయిబాబా కు సర్వస్య శరణాగతి చేసి ఆత్మసాక్షత్కారము పొందిన సిద్ధురాలు .

రాధాకృష్ణమాయి శిరిడిసాయిని గురువుగా ఆరాధించిన శిష్యురాలు . ఆమె మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లాలో జన్మించింది . ఆమె అసలు పేరు సుందరీబాయి . ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది . పెళ్లి అయిన కొన్ని రోజులకే భర్త మరణించాడు . భర్త మరణంతో ఆమె ఆధ్యాత్మిక జీవితం మొదలు అయింది . ఆమె పండరీపురములో ఉంటూ శ్రీకృషుడిని ఆరాధించింది . ఆ సమయములో ఆమె బంధువు అయినా నానా చందోర్కర్ ద్వారా శిరిడి సాయి గురించి విని 1907 సంవత్సరములో శిరిడీలో కాలు పెట్టింది . బాబా తొలిదర్శనములోనే ఆమెకు రాధాకృష్ణులుగా దివ్య దర్శనము ప్రసాదించారు . ఆనాటినుండి చివరి క్షణము వరకు ఆమె శిరిడిలోనే ఉండిపోయింది .

రాధాకృష్ణ మాయి జీవితచరిత్రను పరిశీలించిన వారికి కన్నీళ్ళు ఆగవు . సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షివారు రాధాకృష్ణమాయి జీవితాన్ని పరిశోధన చేసి 2013 మరియు 2014 సంవత్సరములో శిరిడీలో రాధాకృష్ణ మాయి జీవితాన్ని సమగ్రముగా సాధకులకు ప్రవచనాల ద్వారా బోధించారు

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు 2014 వ సంవత్సరములో రాధాకృష్ణమాయి మరణ రహస్యాన్ని ఛేదించారు . శిరిడీలో అనేక సంవత్సరాలనుండి రాధాకృష్ణమాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందనే దుష్ప్రచారము కొనసాగుతోంది . కానీ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారికి ఆమె మరణం వెనుక ఎదో రహస్యం దాగివుందన్న అనుమానం ఉంది ,అందుకే శ్రీ మహర్షివారు శిరిడీలో చాలామంది ప్రముఖుల ద్వారా, గవర్నమెంట్ ఆఫీసియల్ రిపోర్ట్స్ ద్వారా పరిశోధించి ఆమె మరణం సహజ మరణమని నిర్ధారించడం జరిగింది . రాధాకృష్ణమాయి శిరిడి బాబా అనుమతితోనే సమాధి నిష్ఠలో నిలిచి దేహాన్ని త్యజించింది . అసలు సత్యము ఏమిటంటే సిద్ధగురువులు పరమాత్మలో మనస్సు లయింపచేసి సమాధి నిష్ఠలో తమ దేహాన్ని ఎప్పుడైనా త్యజించగలిగే శక్తిని కలిగి ఉంటారు. రాధాకృష్ణమాయి విషయములో కూడా అదే జరిగింది . సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు శ్రీ రాధాకృషమాయి జీవితాన్ని పరిశోధన చేసిన తర్వాత మాయి జీవితాన్ని మరియు పరిశోధనల విశేషాలను 2014 వ సంవత్సరములో ఒక గ్రంథము రచించారు . ఆ గ్రంథమే ప్రేమమయి - సిద్ధయోగి నీ శ్రీ రాధాకృషమాయి నిగూఢ దివ్య చరితామృతం .

గ్యాలెరీ