పురుష సూక్తం

పరమ శివుడు నిర్గుణ, నిరాకార, సచ్చిదానంద స్వరూపుడు. . ఆయన బ్రహ్మ, విష్ణువు మరియు రుద్ర భగవానుని ఆజ్ఞాపించేవాడు.

వేదాలు జ్ఞాన భాండాగారాలు. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామ వేదం అన్నీ కూడా పరమ శివుడే దేవదేవుడనే సత్యంతో ఏకీభవిస్తాయి. పరమ శివుని ఉఛ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు. వేదాలు శివుని పరిపూర్ణ ప్రతిబింబం మరియు శివుడు వేదాల ప్రతిబింబం. వేదాలు అపౌరుషేయములు. పురుష సూక్తం శివుని యొక్క గొప్పతనాన్ని మరియు ఎన్నో మార్మిక విషయాలను వివరిస్తుంది

పురుష సూక్తం యొక్క నిగూఢ రహస్యాలను అర్ధం చేసుకోడానికి, వాటిని ఆధ్యాత్మిక సాధకులకు అందించడానికి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఎంతో శ్రమించారు. సిద్ధగురువులు మాత్రమే పరమాత్మ సందేశాన్ని సరిగ్గా అర్థం చేసుకుని వివరించగలరు .ఇంతటి గొప్ప కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన సిద్ధగురు పాద పద్మములకు నమస్కరిద్దాం

గ్యాలెరీ